దీపావళికి బాణాసంచా కాల్చారో ఆ రాష్ట్రంలో ఇలా పట్టేసుకుంటారు

-

దీపావళికి బాణాసంచా పై పలు రాష్ట్రాలు క్రమంగా నిషేధాన్ని విధిస్తున్నాయి. తాజాగా బాణాసంచా నిబంధనల పై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళీమాత పూజ సందర్భంగా ఫైర్‌ క్రాకర్స్‌పై విధించిన నిషేధాన్ని ఉల్లంఘించే వ్యక్తులను గుర్తించడానికి సరికొత్త వ్యవస్థను సిద్దం చేస్తుంది బెంగాల్ సర్కార్. రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్లకు వెయ్యి వరకు జీపీఎస్‌ అమర్చిన సౌండ్ మానిటరింగ్ పరికరాలను పంపిణీ చేస్తోంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి పటాకులు కాలిస్తే వారిని ఈ డివైజ్ ద్వారా గుర్తించేలా పశ్చిమ బెంగాల్‌ పొల్యూషన్ బోర్డు ప్రణాళిక రచిస్తుంది.

డివైజ్‌ బాణాసంచ పేలుడు ప్రదేశం, తేదీ, సమయాన్ని చూపుతుందని తెలిపారు. వివరాలన్నీ థర్మల్ ప్రింటర్ ద్వారా ఆధారాలను ప్రాసిక్యూషన్ కోసం ప్రింట్‌ తీసుకోవచ్చని చెప్పారు. డివైజ్‌లపై పోలీసులకు అవగాహన కల్పించినట్లు పొల్యుషన్ బోర్డు చైర్మన్‌ కళ్యాణ్‌ రుద్ర చెప్పారు. పండుగ సందర్భంగా లౌడ్‌ స్పీకర్ల నుంచి డెసిబెల్‌ స్థాయిని రికార్డు చేయడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకునేందుకు కొత్త పరికరాలు ఉపయోగపడుతాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news