నంద్యాల పోలీసుల బెయిల్ వెనుక టీడీపీ లాయర్ !

-

ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం వైఎస్ జగన్ పలు జిల్లాల్లోని ముస్లిం సోదరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నంద్యాల ఘటన భాధ కలిగించిందని అన్నారు. ఎక్కడా తన మన బేధం చూపలేదన్న ఆయన ఎవరికైనా న్యాయం ఒకటే నని చర్యలు తీసుకున్నామని అన్నారు.

బాధ్యులైన పోలీసులను అరెస్టు చేశామన్న ఆయన టీడీపీ క్రియాశీలక పదవుల్లో ఉన్న రామచంద్రరావు అనే లాయర్ , బెయిల్ పిటిషన్ వేశారని పేర్కొన్నారు. బెయిల్ ను రద్దు చేసేందుకు పై కోర్టుకు వెళ్లామన్న ఆయన బెయిల్ తప్పకుండా రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక సిఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు పిటిషన్ పై రేపు నంద్యాల కోర్టులో విచారణ జరగనుంది. నిందితుల బెయిల్ రద్దు చేయాలంటూ 3వ అదనపు జిల్లా సెషన్ కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు పోలీస్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news