ఒక వారం పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను టార్గెట్ గా చేసి తీవ్ర విమర్శలు చేసారు. ఉద్దవ్ థాకరే, నా మాట వినండి. మీరు ఓడిపోయారు. మీరు ఓడిపోయారు, అంటూ ఆయన విమర్శలు చేసారు. రాత్రి 8.30 గంటల సమయంలో ముంబై సమీపంలోని తలోజా జైలు నుంచి విడుదలైన వెంటనే గోస్వామి ఈ విమర్శలు చేసారు.
విడుదల అయిన వెంటనే ఆయన తన ఛానల్ కి చెందిన లోయర్ పరేల్ స్టూడియోకు వెళ్లారు. 2018 ఆత్మహత్య కేసులో నవంబర్ 4 న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 8 నుండి తలోజా జైలులో ఉన్న సమయంలో తనపై ముంబై పోలీసులు దాడి చేసారు అని ఆయన ఆరోపించారు. ఉద్దవ్ ఠాక్రే, మీరు నన్ను పాత, నకిలీ కేసులో అరెస్ట్ చేసారు అని నాకు క్షమాపణ కూడా చెప్పలేదని పేర్కొన్నాడు. గేమ్ ఇప్పుడే మొదలయింది అని, అంతర్జాతీయ మీడియాలో కూడా ఉంటా అంటూ, అన్ని భాషల్లో ఛానల్ ని మొదలు పెడతా అని ప్రకటించారు.