బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వాడకంపై దర్యాప్తుకు సంబంధించి బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శుక్రవారం పిలిచింది. మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ నవంబర్ 9 న అతని నివాసంలో దాడి చేసింది. ఈరోజు, అతని స్నేహితురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ మాదకద్రవ్యాల సంబంధిత కేసుకు సంబంధించి రెండవ రౌండ్ విచారణ కోసం ఎన్‌సిబి ముందు హాజరయ్యారు.
దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఎన్‌సిబి జోనల్ కార్యాలయంలో బుధవారం ఆమెను దాదాపు ఆరు గంటలు విచారించారు. రాంపాల్ నివాసం నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను ఎన్‌సిబి అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారని, నటుడి డ్రైవర్ ను కూడా ప్రశ్నించారని ఒక అధికారి చెప్పారు. ఈ కేసుకి సంబంధించి స్టార్ నటులను విచారించిన సంగతి తెలిసిందే.