సోలో బ్రతుకే సో బెటరు.. థియేటర్లలోకి వచ్చేస్తోంది..

-

కరోనా లాక్డౌన్ తర్వాత థియేటర్లకి అనుమతులు ఇచ్చినప్పటికీ సీటింగ్ సామర్థ్యంలో షరతులు విధించింది. థియేటర్లలో ఉండే సీట్లకి సగం మంది మాత్రమే సినిమా చూసే అవకాశం ఉందని తెలిపింది. సీటింగ్ కెపాసిటీ తగ్గితే థియేటర్లకి, సినిమా వారికి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఈ కారణంగానే థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ తాజాగా సాయి ధరమ్ తేజ్, తన సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నాడు.

సోలో బ్రతుకే సో బెటరు పేరుతో తెరకెక్కిన మూవీ డిసెంబరు నెలలో థియేటర్లలోకి రానుందట. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సాయి తేజ్ స్పందించాడు. ఐతే డిసెంబరులో అని చెప్పాడు కానీ ఏ తేదీన వస్తుందో చెప్పలేదు. డిసెంబరులో సినిమాల వారం చివరివారమే కాబట్టి అప్పుడే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుండి థియేటర్లలో రిలీజ్ అవబోయే మొదటి సినిమా సోలో బ్రతుకే సో బెటరు అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news