పెళ్లయిన కాసేపటికే.. ఊరేగింపులోనే పెళ్లి కొడుకు అరెస్ట్.. ఎందుకో తెలుసా?

-

Mumbai Man Arrested From His Own Wedding Party for Stealing a Mobile Phone

ఆ వ్యక్తి మంచిగా పెళ్లి చేసుకున్నాడు. అంగరంగ వైభవంగా మనోడి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత ఊరేగింపుగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇంతలోనే ఉన్నట్టుండి పెళ్లి కొడుకు కనిపించలేదు. పెళ్లి కొడుకుతో పాటు పెళ్లి కొడుకు ఫ్రెండ్ కూడా కనిపించకుండా పోయాడు. ఇంతకీ ఏం జరిగిందని పెళ్లి కూతురు తరుపు వాళ్లు ఆరా తీస్తే అసలు విషయం తెలిసి షాక్ తిన్నారు. నోరెళ్ల బెట్టారు. ఇంతకీ ఏంటి సంగతి అంటే.. ఆ పెళ్లి కొడుకును ఓ దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అది సంగతి. ఈ ఘటన ముంబైలోని బాంద్రాలో చోటు చేసుకున్నది.

Mumbai Man Arrested From His Own Wedding Party for Stealing a Mobile Phone

మనోడు… తన పెళ్లి కంటే ఒకరోజు ముందు చెంబూరు సమీపంలో రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళ మొబైల్‌ను బైక్‌పై వెళ్తూ దొంగలించాడు. అతడి ఫ్రెండ్ అల్తాఫ్, పెళ్లి కొడుకు అజయ్ సునీల్.. ఇద్దరు కలిసే బైక్‌పై వెళ్తూ ఈ దొంగతనం చేశారు. తర్వాత ఏం తెలియనట్టు వచ్చి తెల్లారి బాంద్రా కోర్టులో పెళ్లి చేసుకున్నాడు. తన మొబైల్ చోరీ గురించి పోలీస్ స్టేషన్‌లో ఆ మహిళ ఫిర్యాదు చేయగా.. అక్కడి సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. బైక్‌పై వెళ్లిన ఇద్దరు వ్యక్తుల గురించి ఆరా తీయగా.. వాళ్లు అజయ్ సునీల్, అల్తాఫ్ గా గుర్తించారు. దీంతో మనోడి పెళ్లి ఊరేగింపు జరుగుతున్నా.. ఏమాత్రం లెక్క చేయకుండా.. పెళ్లి కొడుకును, అతడి ఫ్రెండ్‌ను సైలెంట్‌గా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news