కాలుష్యం బాగా ఉందా ? ఈ మొక్క‌ల‌ను పెంచుకుంటే గాలిని శుభ్రం చేస్తాయి..!

-

ప్ర‌స్తుత త‌రుణంలో గాలి కాలుష్యం ఎక్క‌డ చూసినా విప‌రీతంగా పెరిగిపోయింది. దీంతో జ‌నాల‌కు స్వ‌చ్ఛ‌మైన గాలి ల‌భించ‌డం లేదు. ఫ‌లితంగా ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ నిత్యం స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అయితే బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మ‌న‌కు ఎలాగూ స్వ‌చ్ఛ‌మైన గాలి లభించ‌దు. కానీ ఇంట్లో ఉన్న‌ప్పుడైనా స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చేందుకు య‌త్నించాలి. అందుకు గాను కింద తెలిపిన మొక్క‌లు ఎంత‌గానో ఉప‌యోగప‌డ‌తాయి. ఇవి మ‌న ఇంట్లోని గాలిని ఫిల్ట‌ర్ చేస్తాయి. దీంతో మ‌న‌కు ఇంట్లో స్వ‌చ్ఛ‌మైన గాలి ల‌భిస్తుంది. మ‌రి ఆ మొక్క‌లు ఏమిటంటే…

1. మ‌నీ ప్లాంట్

5 plants that purifies air at your home

వాస్తు ప్ర‌కారం మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకుంటే ధ‌నం ల‌భిస్తుంద‌ని చెబుతారు. కానీ నిజానికి ఈ మొక్క గాలిని కూడా శుభ్రం చేస్తుంది. గాలిలో ఉండే బెంజీన్‌, ఫార్మాల్డిహైడ్‌, జైలీన్, టోలీన్ వంటి కాలుష్య కార‌కాల‌ను నిర్మూలిస్తుంది. ఈ క్ర‌మంలో స్వ‌చ్ఛ‌మైన గాలి మ‌న‌కు ల‌భిస్తుంది.

2. స్నేక్ ప్లాంట్

ఈ మొక్క రాత్రి స‌మ‌యంలో ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తుంది. దీని వ‌ల్ల గాలిలో ఉండే బెంజీన్‌, ఫార్మాల్డిహైడ్‌, ట్రైక్లోరోఎథిలీన్, జైలీన్‌, టోలీన్ వంటి కాలుష్య కార‌కాలు నిర్మూలింప‌బ‌డ‌తాయి. ఫ‌లితంగా స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చ‌వ‌చ్చు.

3. అరికా పామ్

ఈ మొక్క కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. దీని వ‌ల్ల మ‌న చుట్టూ ఉండే ప‌రిస‌రాల్లోని వాతావ‌ర‌ణం శుభ్ర‌మ‌వుతుంది. హానిక‌ర‌మైన కాలుష్య కారకాలు తొల‌గింప‌బ‌డ‌తాయి. స్వ‌చ్ఛ‌మైన గాలి ల‌భిస్తుంది.

4. పీస్ లిల్లీ

ఈ మొక్క‌కు తెలుపు రంగులో అంద‌మైన పూలు పూస్తాయి. ఈ మొక్క ఎయిర్ ప్యూరిఫైర్ గా ప‌నిచేస్తుంది. గాలిలో ఉండే కాలుష్య కార‌కాల‌ను 60 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తుంది. అలాగే ఆల్క‌హాల్‌, ఎసిటోన్ తుంప‌ర్ల‌ను కూడా నిర్మూలిస్తుంది.

5. అలోవెరా

అలోవెరా మొక్క ఆకులు మ‌న‌కు ఔష‌ధ ప‌రంగా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే ఈ మొక్క గాలిని కూడా శుద్ధి చేస్తుంది. అందువ‌ల్ల దీన్ని కూడా మ‌నం ఇండ్ల‌లో పెంచుకోవ‌చ్చు. దీంతో స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news