కరోనా వ్యాక్సిన్ గురించి బాలకృష్ణ సంచలనం.. అది రాదు !

నందమూరి హీరో బాలకృష్ణ కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ రాలేదు అని పేర్కొన్న ఆయన కరోనా ఆ కరోనా మన జీవితాంతం ఉంటుందని అన్నారు. మనం జాగ్రత్తగా ఉండటం ముఖ్యం అని ఆయన అన్నారు. ఇప్పటికైతే వ్యాక్సిన్ రాలేదు ఇక ముందు కూడా రాదు అని బాలయ్య అన్నారు. అలాగే వ్యాక్సిన్ వస్తుందని అంటున్నారు కానీ అది అయితే నిజం కాదు అని ఆయన పేర్కొన్నారు.

Balakrishna
Balakrishna

అసలు వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదు అని పేర్కొన్న ఆయన మనం జాగ్రత్తగా ఉండడమే ముఖ్యమని పేర్కొన్నారు. హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా నటిస్తున్న ‘సెహరి’ సినిమా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసిన సందర్భంగా బాలయ్య ఈ కామెంట్స్ చేశారు. సంగీత దర్శకుడు కోటి కీలక పాత్రను పోషిస్తున్న ఈ సినిమాని జ్ఞానసాగర్‌ అనే దర్శకుడు తెరకెక్కించారు.