భారత్ చైనా సరిహద్దుల్లో గత 30 రోజులుగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) పోస్టుల విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. చైనా ఆక్రమిత అక్సాయ్ చిన్ లోని ఘర్షణ ప్రదేశాలలో రహదారి మౌలిక సదుపాయాలను వేగంగా బలోపేతం చేయడానికి చైనా ప్రయత్నం చేస్తుంది. 3,488 కిలోమీటర్ల సరిహద్దు రేఖ వెంట చైనా సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
అయితే మీడియా వర్గాలు చెప్పే దాని ప్రకారం సరిహద్దుల్లో చైనా వెనక్కు తగ్గడానికి ఇష్టపడటం లేదని వెల్లడించాయి. భారత్-చైనా సైనిక చర్చల తొమ్మిదవ రౌండ్ త్వరలో జరగనుంది. సీనియర్ మిలిటరీ కమాండర్లు వెల్లడించిన వివరాల ప్రకారం, కరాకోరం పాస్ కు 30 కిలోమీటర్ల తూర్పున ఉన్న సమర్ లుంగ్పా వద్ద పిఎల్ఎ 10 డగౌట్లను నిర్మిస్తోంది. అలాగే రెచిన్ లాకు దక్షిణంగా ఉన్న సాజుమ్ పర్వతం వద్ద ఈ నిర్మాణాలు ఉన్నాయి. దీని ద్వారా డౌలెట్ బేగ్ ఓల్డి కి 70 కిలోమీటర్ల తూర్పున ఉన్న క్జిల్ జిల్గా వద్ద దళాల మోహరింపును పెంచుతోంది.