ప్రజాకూటమిలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సీటుని తెదేపాకు కేటాయించారు. దీంతో ఆస్థానంలో ఎప్పటినుంచో తన కేడర్ ను కాపాడుకుంటున్న మల్ రెడ్డి రంగారెడ్డి రెబల్అభ్యర్థిగా బరిలో నిలిచి బీఎస్పీ నుంచి నామినేషన్ వేశారు. దీనికి తోడు ప్రచారంలో దూకుడు పెంచారు. తెదేపా నుంచి సామారంగారెడ్డి ప్రచారంలో చాలా వెనకబాటులో ఉండటం వల్ల తెరాసను ఒడించడంలో మల్రెడ్డిరంగారెడ్డి సరైన వాడిగా భావించిన టీపీసీసీ అధ్యక్షుడు గురువారం సాయంత్రం మల్రెడ్డి రంగారెడ్డికే మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌నాయకులు, కార్యకర్తలు మల్‌రెడ్డి రంగారెడ్డికేఓటేయాలని అభ్యర్థించారు. ఇతర నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగినకాంగ్రెస్ నేతలను సస్పెండ్ చేసిన ఆ పార్టీ మల్‌రెడ్డి విషయంలో మాత్రం సానుకూలంగావ్యవహరించింది.
ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ సామ వర్గీయులు గాంధీభవన్‌ఎదుట ధర్నా చేసినా ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పోలింగ్‌కు కొన్ని గంటలముందు ఆయనకే మద్దతు ఇస్తున్నట్టు టీపీసీసీ ప్రకటించడం గమనార్హం. దీంతో నేటిపోలింగ్ తో అభ్యర్థుల భవిష్యత్ తేలనున్న సందర్భంగా రాజకీయ పార్టీలు ఎన్ని ఎత్తులువేస్తాయో మరీ.