పెద్ద దొంగతనాన్ని చిన్న స్లిప్ పట్టించింది

-

గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన బ్యాంకు దొంగతనంలో పోలీసులు కేసుని చేధించారు. స్టేట్ బ్యాంక్ చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ నెల 21న దాచేపల్లి మండలం నడికుడి బ్యాంకులో 85 లక్షల దొంగతనం జరిగింది. ఆ తర్వాత వీరి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలించినా… సీసీ టీవీ ఫూటేజ్ పరిశీలించినా సరే లాభం లేకుండా పోయింది. బ్యాంకు లో సీసీ టీవీ ఫూటేజ్ ని కట్ చేసారని గుర్తించారు.Thief cleans out Dehradun shop, but leaves behind THIS evidence, arrested -  News Nation English

ఆ తర్వాత పోలీసులు ఒక చిన్న కాగితం ఆధారంగా దర్యాప్తు చేసారు. మిర్యాలగూడ కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు ఇద్దరూ… ఇళ్లలో దొంగతనాలు చేయటంలో ఇద్దరూ సిద్ధహస్తులని వెల్లడించారు. స్లిప్ లో ఫోన్ నంబర్ ని బట్టి చోరీ కి పాల్పడిన వారిని గుర్తించారు. బ్యాంకు లో దోచుకున్న సొమ్ములో 45 లక్షలు దాచేపల్లి మండలం సుబ్బమ్మ హోటల్ ఎదురుగా వున్న స్మశానం లో వదిలేసి వెళ్ళారు. ఒక దొంగ ఇంట్లో 16 లక్షల చోరీ చేసిన సొమ్ముని స్వాధీనం చేసుకున్నారు. మరో దొంగ ఇంటి ఎదురుగా వున్న రాళ్ల గుట్టలో 15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news