బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్..

Join Our Community
follow manalokam on social media

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ ఛత్రపతి హిందీ రీమేక్ ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడని వినిపించింది. తాజాగా ఈ విషయమై అధికారిక సమాచారం వచ్చింది. వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలోకి అడుగుపెడుతున్నాడు. తెలుగులో తన మొదటి సినిమాకి దర్శకత్వం వహించిన వినాయక్ గారికే బాలీవుడ్ లోనూ అవకాశం ఇస్తున్నాడు.

పెన్ మూవీస్ బ్యానర్ లో జయంతి నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. తెలుగులో రాక్షసుడు సినిమాతో మంచి విజయం అందుకున్న బెల్లంకొండ అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బెల్లంకొండ తెలుగు చిత్రాలు హిందీలోకి అనువాదం అయ్యి మంచి వ్యూయర్ షిప్ దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు డైరెక్ట్ బాలీవుడ్ లోకే అడుగుపెడుతున్న బెల్లంకొండకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

TOP STORIES

10వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. వెంట‌నే అప్లై చేయండి..!

తెలంగాణ స‌ర్కిల్‌లో గ్రామీణ్ డాక్ సేవ‌క్స్ (జీడీఎస్) పోస్టుల భ‌ర్తీకి గాను ఇండియా పోస్ట్ ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే...