గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల చాలా వస్తూ ఉంటాయన్న ఆయన ఓటు వేసే ముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలని కోరారు. ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే చర్చ ప్రజల్లో జరగాలని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల్లో అలాంటి చర్చ జరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి మంచిది అని ఆయన అన్నారు.
అప్పుడే మంచి నేతలు రాజకీయాలలో ఉంటారని ఆయన అన్నారు. ఇది మెచ్యూర్ డెమోక్రసీ అని పేర్కొన్న ఆయన గతంలో తెలంగాణ వాళ్లు తెలంగాణను పరిపాలించలేరని కొందరు విమర్శించారని అన్నారు. ఏకంగా హైదరాబాద్ ఖాళీ అవుతుందని కొందరు ప్రచారం చేశారని ఆయన అన్నారు. అప్పుడు నా ప్రసంగాలు జనం చాలా ఆసక్తిగా చూసేవారని అన్నారు. గతంలో లాగా తెలంగాణలో ఎప్పుడు నీళ్లు పంచాయతీలు కరెంటు కోతలు లేవు అని కేసీఆర్ పేర్కొన్నారు.