ఆరోగ్యకరమైన జీవితం కోసం మార్చుకోవాల్సిన అలవాట్లు..

-

జీవితం ఆనందంగా సాగాలంటే కొన్ని అలవాట్లు అలవర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. మన అలవాట్లే మన జీవితాల్ని నిర్దేశిస్తాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు ఆనందకరమైన జీవితం వైపుకు తీసుకెళతాయి. జీవితంలో ప్రశాంతంగా ఉండాలన్నా, విజయం సాధించాలన్నా ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవడం అవసరం. ఐతే కొన్ని మార్చుకోవాల్సిన అలవాట్లేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మనిషి జీవితం చాలా మారిపోయింది. అరచేతిలో ఉన్న ఆటబొమ్మతో మొత్తం ప్రపంచమే మారిపోయింది. మనక్కావాల్సిన వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా పక్కనే ఉన్న ఫీలింగ్ ని కలగజేస్తున్నాయి. మిస్సింగ్ ఫీలింగ్ ని మిస్ చేస్తున్న స్మార్ట్ ఫోన్లని ఎక్కడ వాడాలన్న విషయం చాలా మందికి తెలియదు. ఫోన్ చేతిలో ఉందని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తూ ఉంటారు. వీధిలో పదిమంది కనిపిస్తే అందులో కనీసం ఐదుగురన్నా ఫోన్ పట్టుకుని కనిపిస్తూ ఉంటారు.

అంతలా అడిక్ట్ అయిన స్మార్ట్ ఫోన్ ని వాడాల్సిన చోటు వాడకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కిచెన్ లో ఉన్నప్పుడు, డైనింగ్ టేబుల్ మీదా, చివరికి బాత్రూంలో కూడా ఫోన్ వాడేస్తున్నారు. ఐతే ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. కిచెన్ లో ఉన్నప్పుడు నీళ్ళు తాగడం, వండడం మాత్రమే చేయాలి. డైనింగ్ టేబుల్ మీద భోజనం మాత్రమే చేయాలి.. అలాగే చదువుకునే టేబుల్ మీద ఫోన్ ముట్టకూడదు.

ఇలా కాకుండా మొత్తం ఖంగాళీగా ఇష్టం వచ్చినట్టుగా మార్చేయడంతో మనసు కూడా ఖంగాళీగా మారుతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వస్తుంది. చదువు మీద శ్రద్ధ చూపించకపోవడానికి గల ముఖ్య కారణాల్లో చదువుకునే టేబుల్ మీద ఫోన్ వాడటమే. అందుకే ఏ పని ఎక్కడ చెయ్యాలో అక్కడ మాత్రమే చెయ్యండి. ఒక వారం రోజుల పాటు ఇలా చేసి చూడండి. మీ మెదడు మరింత చురుగ్గా పనిచేసి, ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే శరీరంలోని అన్ని అవయవాలకి వాటి పని ఏంటనేది తెలియజేసిన వాళ్లవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news