ఏలూరులో ఇప్పుడు వింత రోగం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కారణం ఏంటీ అనేది తెలియకపోయినా సరే ఇప్పుడు వింత రోగం కేసులతో ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా 11 కేసులు నమోదు అయ్యాయి. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి పెద్ద ఎత్తున బాధితులు చేరుకుంటున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పరిక్షలు చేయడానికి ఏలూరు వస్తుంది.
ఏలూరు ఆసుపత్రికి ఇతర ప్రాంతాల నుంచి వింత రోగం బాధితులు వస్తున్నారు. దెందులూరు నుంచి ఆరుగురు బాధితులు ఆసుపత్రిలో చేరారు. కృష్ణా జిల్లా కైకలూరు, నూజివీడుల నుంచి అయిదు కేసులు వచ్చాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కేసులకు ఏలూరు వింతరోగంతో సంబంధం లేదు అని వైద్యులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ బృందం కూడా నేడు పర్యటన చేస్తుంది.