కాఫీ డేకి మంచి రోజులు వచ్చాయి..!?

-

బెంగళూరు: కెఫే కాఫీ డే గురించి తెలియని వారుండరూ. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు వందలాది బ్రాంచీలు ఉన్నాయి. కెఫే కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో సంచలనం రేపాయి. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి.

 

సిద్ధార్థ మరణం తర్వాత గతేడాది జూలైలో స్వతంత్ర బోర్డు సభ్యుడు ఎస్వీ.రంగనాథ్ ను తాత్కలిక చైర్మన్ గా నియమించారు. అయితే సోమవారం సీఈఓగా సిద్ధార్థ సతీమణి మాళవిక హెడ్గే బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సంస్థ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. నూతన సీఈఓ మాళవిక కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కుమార్తె. అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నానని మాళవిక పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కాఫీ డేని మరింత అభివృద్ధి చేస్తానని ఆమె అన్నారు.

కాఫీ డే కంపెనీ అదనపు డైరెక్టర్లుగా సీహెచ్ వసుంధరా దేవి, గిరి దేవనూర్, మోహన్ రాఘవేంద్ర కొండిని నియమిస్తున్నట్లు బోర్డు డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ ముగ్గురూ 2025 డిసెంబర్ 31 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ల హోదాలో కొనసాగుతారని బోర్డు డైరెక్టర్లు వెల్లడించారు. సిద్ధార్థ మరణించే సమయానికి కంపెనీ అప్పుల్లో ఉందని.. ఆయన చనిపోయిన నాటి నుంచి గత ఏడాదిగా అప్పులు తీర్చే ప్రయత్నాల్లో సీడీఈఎల్ ప్రయత్నం చేస్తోంది.

బెంగళూరుకు చెందిన కెఫే కాఫీ డే దేశవ్యాప్తంగా వందలాది కాఫీ షాపులు నిర్వహిస్తోంది. మనీడ్ క్లాస్ ప్రజల కోసం కాపచీనో, లాట్స్ ని అందుబాటులోకి తెచ్చాయి. స్టార్ బక్స్ కార్ప్, బారిస్టా, కోకాకోలా కో యాజమాన్యంలోని కోస్టా కాఫీతో కాఫీ డే పోటీ పడుతుంది. సిద్ధార్థ మరణం తర్వాత సంస్థ భవిష్యత్ అనిశ్చితిలో పడింది. అతని మరణంతో కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ షేర్లు ఒక్కసారిగా తగ్గాయి. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన మాళవిక ఆధ్వర్యంలో కంపెనీ వృద్ధి చెందుతుందని డైరెక్టర్లు ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news