బెంగాల్‌లో మరింత హీటెక్కిన రాజకీయం

-

బెంగాల్‌ రాజకీయం మరింత హీటెక్కింది. బెంగాల్ సర్కార్ ను కూల్చేందుకు కాషాయం కత్తికడుతోందని నిప్పులు చెరిగిన మమతపై కౌంటర్ ఎటాక్ కు దిగారు కమలనాథులు . మొత్తానికి.. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నా.. అప్పుడే మమత సర్కార్‌, బీజేపీ మధ్య మాటల తుటాలు పేలుతున్నాయ్‌.


వచ్చే ఏడాది బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయ్‌. ఇప్పటి నుంచే అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.మమత సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మమత అరాచక పాలనకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పబోతున్నారని విమర్శించారు. సౌత్‌ నార్త్‌ తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగరవేశామని.. బెంగాల్‌లో కూడా అధికారంలోకి రాబోతున్నామన్నారు జేపీ నడ్డా.

బీజేపీపై విరుచుకుపడ్డారు బెంగాల్ సీఎం మమత బెనర్జీ. డబ్బు సంచులతో తమ ప్రభుత్వాన్ని బీజేపీ విచ్చినం చేసే కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ చేసే కుట్రలను తమ రాష్ట్రంలో సాగనివ్వబోమని స్పష్టం చేశారు మమత. అవినీతి నేతలే బీజేపీతో చేతులు కలుపుతున్నారని విమర్శించారు.

మొత్తానికి బెంగాల్‌లో బీజేపీ, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య రాజకీయం రోజుకో మలుపు తీసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news