ఇది వరకు దారి కాసి దోచుకునేవారు కానీ ఇప్పుడు ఓటీపీల ద్వారా దోచుకుంటున్నారు. సికింద్రాబాద్ కి చెందిన డాక్టర్ అర్జున్ రావు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో లింక్ అయి ఉన్న మెయిల్ ఐడి ని హ్యాక్ చేసి 8 లక్షలు కాజేశారు సైబర్ చీటర్స్. మరో కేసులో కాచిగూడకి చెందిన శేషగిరిరావు. తన క్రెడిట్ కార్డ్ బిల్ ఆన్లైన్ లో కట్టే సందర్భంలో ఓ ఆప్ డౌన్లోడ్ చేయగా దాని ద్వారా అకౌంట్ లో ఉన్న 6.3 లక్షల రూపాయలు కాజేశారు.
ఈ ఇద్దరూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈ మెయిల్ లింక్ ఉన్న వినియోగదారులు తమ మెయిల్స్ కి వచ్చే ఓటీపీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. సో బీ కేర్ ఫుల్.