ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పోకడలు ఒకే రకంగా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. తీసుకుంటున్న నిర్ణయాలు… చేస్తున్న పనులు కూడా ఒకే రకంగా ఉంటున్నాయి. ఇక ఇప్పుడు పర్యటనలు కూడా ఒకే రకంగా ఉండటంతో ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. ఇటీవలే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కు వెళ్లి వచ్చాడు అనే విషయం తెలిసిందే.
అయితే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చాడో లేదో ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తిన బాట పట్టడం ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. అయితే సాగు జల ప్రాజెక్టుల పంచాయతీని ఢిల్లీ పెద్దల సమక్షంలో పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రులు వరుసగా హస్తిన పర్యటనకు వెళుతున్నారు అని తెరమీద వాదన వినిపిస్తున్నప్పటికీ తెర వెనుక కథ మాత్రం వేరే అని అంటున్నారు ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో బిజెపి బలపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ వలలో కేసీఆర్ పడకుండా ఉండేలా బిజెపి పెద్దలు చర్చించగా.. ఇక తిరుపతి ఉప ఎన్నిక గురించి చర్చించేందుకు అటు సీఎం జగన్ ను పిలిచినట్లు టాక్ వినిపిస్తోంది.