భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి ఈరోజు బీజేపీ అధ్యక్ష్యుడు బండి సంజయ్ బీజేపీ నుండి గెలిచిన కార్పొరేటర్స్ వెళ్లి పూజలు చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సమక్షంలో బీజేపీ కార్పొరేటర్ లతో సంజయ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ గ్రేటర్ అభివృద్ధి కి సహకరిస్తాం…కేంద్ర నిధులు తెచ్చేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. గ్రేటర్ లో ముఖ్యమంత్రి వ్యవహార శైలి వల్ల .. చేతగాని తనం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు.
మేయర్ మేము కాలేక పోవచ్చు మా కార్పొరేటర్ లు హైదరాబాద్ అభివృద్ధి కోసం లక్ష్మిభాయి.. శివాజీ లాగా పోరాడుతారని ఆయన అన్నారు. కార్పోరేటర్లు కొనుగోళ్ళకు టీఆర్ఎస్ ప్రయత్నాలూ ప్రారంభించిందన్న ఆయన బీజేపీ కార్పోరేటర్లను కెలికితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ చేర్చుకోవటానికి వెనుకాడమని అన్నారు. పొర్లుదండాలు పెట్టినా కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమన్న ఆయన కుట్రలు కుతంత్రాలతో మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు.