వివాహ భోజనంబు టీజర్: కరోనా లాక్డౌన్ కష్టాలని కామెడీగా..

-

కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో కనిపించిన సత్య, మత్తు వదలరా చిత్రంతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఆ సినిమా విజయం సాధించడంతో అతని చేతిలో మంచి మంచి ఆఫర్లు వచ్చి చేరాయి. తాజాగా కమెడియన్ సత్య హీరోగా మారాడు. వివాహ భోజనంబు అనే టైటిల్ తో సత్య హీరోగా సినిమా తెరకెక్కింది. వివాహ భోజనంబు టీజర్ ఈ రోజే రిలీజైంది. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా నవ్వులు తెప్పించేలా ఉంది. పిసినారి అయిన సత్య, లాక్డౌన్ లో పెళ్ళి చేసుకుని, ఆ తర్వాత వాళ్ళ మామగారు సహా ఇంటి వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది.

మధ్య తరగతి వ్యక్తి అయిన సత్య పాత్ర, లాక్డౌన్ టైమ్ లో అంత పెద్ద కుటుంబాన్ని ఎలా మేనేజ్ చేసాడన్నదే ఆసక్తికరంగా ఉంది. ఐతే టీజర్ చివర్లో హీరో సందీప్ కిషన్ ఎంట్రీ ఇచ్చాడు. అతిధి పాత్రలో నటిస్తున్న సందీప్ కిషన్, మాస్ గెటప్ లో కనిపించాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ విజయ్ సంగీతం అందిస్తున్నాడు. లాక్డౌన్ సగటు మధ్యతరగతి మానవుడు పడ్డ ఇబ్బందులకి, వినోదం మేళవించి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న వివాహ భోజనంబు ఏ విధంగా ఆకర్షిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news