టీ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం తేల్చి చెప్పింది ఇదేనా ?

-

తెలంగాణ కాంగ్రెస్ లో అధికారంలో ఉన్నా… పార్టీ చావో..రేవో లాంటి సమస్యలో ఉన్నా… నాయకులు మాత్రం ఎవరిష్టం వారిదే. ఎవరికి తోసిన పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడేస్తారు. మిగిలిన పార్టీ లలో ఇలా ఉండదు అంటే… కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ..? సోనియాగాంధీ… రాహుల్ గాంధీలపై తప్పితే… ఎవరి మీదైనా… ఎవరైనా మాట్లాడొచ్చు అనే పరిస్థితి కానీ వీటన్నిటికి చెక్ పెడుతూ అధిష్టానం మాత్రం అందరికి ఓ మాట చెప్పిందట. అదేమంటే…

తెలంగాణ కాంగ్రెస్ లో అందరూ సీనియర్ నాయకులే. అంతెందుకు గాంధీ భవన్ లో కూర్చొని పీసీసీ చీఫ్ నే తిట్టే సంస్కృతి సాధారణ పరిస్థితిలో అయితే ఓకే. కానీ… పార్టీ కొత్త నాయకత్వం..నాయకుణ్ణి ఎంచుకునే పనిలో ఉండగా కూడా ఎవరికి వారు…తమ నోటికి పని చెప్తున్నారు. పీసీసీ ఎంపికపై..ఇప్పటికే ఏఐసీసీ ఇంఛార్జి ఠాగూర్ అభిప్రాయం సేకరణ చేశారు. ఠాగూర్ ఇక్కడ ఉండగానే కొందరు నాయకులు తమ అభిప్రాయాలు చెప్పారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ..పార్టీ ఇంఛార్జి ఢిల్లీకి వెళ్లిన తర్వాత పార్టీకి చెందిన కొంత మంది నాయకులు ఢిల్లీ కి వెళ్లడం ఒక ఎత్తయితే… మిగిలిన నాయకులు కూడా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు.

పీసీసీ నియామకం పై ఒకరికి ఇవ్వాలని…ఇంకొకరికి ఇవ్వొద్దని వివాదాలకు దారి తీస్తున్నాయి నాయకుల కామెంట్స్. పార్టీ అసలే ఇబ్బందుల్లో ఉంటే నాయకుల మాటలు పార్టీలో చీలిక వచ్చేలా ఉన్నాయని పార్టీ ఇంఛార్జి ఠాగూర్ అధిష్టానం పెద్దల చెవిలో వేశారట. అంతే ఇక రంగంలోకి దిగిన ఏఐసీసీ పెద్దలుపార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారట. పీసీసీ గురించి ఏ నాయకుడు మాట్లాడొద్దని సైలెంట్ గా ఉండాలని అదేశించారట. దీనికి తోడు పార్టీ ముఖ్య నాయకులతో ఏం మాట్లాడారు… ఏం చెప్పారు అనే అంశాలు కూడా పంచుకోవడం అవసరమా అని చెప్పారట.

ఇంఛార్జి గా ఠాగూర్ వచ్చినప్పటి నుండి ఇలాంటి ఆదేశాలు వచ్చాయి. కొంత కంట్రోల్ లోనే ఉన్నప్పటికీ… పీసీసీ నియామకం కి సంబందించిన అంశం తెర మీదకు వచ్చినప్పటి నుండి నాయకులు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవడం ఎక్కువవ్వడం తో అధిష్టానం అందరికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట. ఆదేశాలు జారీ చేయడం పార్టీ అధిష్టానం నిర్ణయం. దాన్ని అమలు చేయాలో వద్దో నాయకుల ఇష్టం. కానీ అధిష్టానం మాత్రం కొంత సీరియస్ గా ఉండకపోతే ఇబ్బందే నని గుర్తించింది.

Read more RELATED
Recommended to you

Latest news