విధి వక్రించి రోడ్ ప్రమాదం రూపం లో ఆ ఇంట్లోని ఇద్దరు కొడుకులను మింగేసింది .వాళ్ళ తల్లి తండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది .దీంతో ఆ కుటుంభం మొత్తం శోక సంద్రం లో మునిగిపోయారు .వర్గల్ మండలం అనంతగిరి పల్లి గ్రామానికి చెందిన తుమ్మల రామకృష్ణ, లక్ష్మణణ్ లు అన్నదమ్ములు.
వారు వ్యవసాయ౦ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు . వాళ్ళ చెల్లెలి భర్త యాట శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. అతను తూఫ్రాన్ సమీపంలోని ఓ ప్రైవేటు సంస్థలోపని చేస్తుండటం తో ఆవుద్యోగ కాస్త కూతురికి ఇచ్చారు . అయితే రామకృష్ణ లక్ష్మణ్ కుమారులు కూడా పని చేస్తుంటారు .వారు వెళ్ళేటప్పుడు ఆమెని పని చేసే చోట దింపి వాళ్ళు వెళ్తుంటారు .
ఈ నెల 15 వ తేదీన ఎప్పటిలాగే ఆమెని దింపి వాళ్ళు వెళ్తుండగా మృతువు వారిని కబళించింది . తూఫ్రాన్ పరిధి లోని అల్లాపూర్ వద్ద గజ్వేల్ రహదారిపై జరిగిన ప్రమాదంలో .తమ్ముడు అరవింద్ అక్కడికక్కడే చనిపోగా … కరుణాకర్ తీవ్రంగాయ పడ్డాడు . తీవ్ర గాయాలైన కరుణాకర్ని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా …చికిత్సపొందుతూ మృతి చెందాడు . దీంతో.. ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు పోగొట్టుకోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు చనిపోవటం తో వారి ఆవేదన వర్ణనాతీతంగా వుంది .చెల్లలి భర్త చనిపోవటం …అంత లోనే మల్లి ఇద్దరు చేతి కందోచినకొడుకులను రోడ్ ప్రమాదం రూపం లో కోల్పోవటం తో వారిని బతికున్న శవాలుగా మార్చింది విధి . తమని మృత్యువు తీసుకెళ్లి తమ బిడ్డలను బ్రతికించు దేవుడా అని గుండెలవిసేలా రోదిస్తున్నారు .ఒక్కటిగా పనికి వెళ్లే అన్న దమ్ములు …ఒక్కటిగానే ఒకరి తర్వాత ఒకరు చనిపోయారని కన్నవారు విలపిస్తుంటే గ్రామస్థులకు కంట తడి పెట్టించింది .