కష్టాల్లో 20 లక్షల తెలంగాణ ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు కేటీఆర్. ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు అంటూ కేటీఆర్ సెటైర్లు పేల్చారు. తెలంగాణ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని ఆగ్రహించారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు.
ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చుసిన కేసీఆర్ సర్కార్-వైద్యానికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని కాంగ్రెస్ సర్కార్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ మొండి వైఖరితో ఇబ్బందులో 20 లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణం మా ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేసి ఉద్యోగులకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.
తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండా బద్దలు కొట్టాడు. కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.