మోడల్ స్కూల్స్‌లో 1,115 తాత్కాలిక టీచర్ల భర్తీకి సర్కార్ గ్రీన్‌సిగ్నల్

-

తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో రెగ్యులర్ టీచర్లు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సమస్యలు, వారి అకాడమిక్ ఇయర్, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తాత్కాళిక పద్ధతిన టీచర్లను రిక్రూట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే డీఎస్సీ పోస్టులకు పరీక్షలు నిర్వహించగా.. గురుకుల పాఠశాలలకు రెగ్యులర్ బేసిస్ మీద టీచర్ల నియామకాన్ని కాంగ్రెస్ సర్కార్ భర్తీ చేసింది.

ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో 1,115 మంది తాత్కాలిక టీచర్లను నియమించుకోవడానికి విద్యాశాఖ అనుమతులు ఇచ్చింది. 507 మంది హిందీ టీచర్లు, ఇన్‌చార్జి ప్రిన్సిపల్స్ ఉన్న చోట అదనంగా 94 మందిని విధుల్లోకి తీసుకోనుంది. వీరు హావర్లీ బేస్డ్ టీచర్లుగా వ్యవహరించనున్నారు. వీరికి నెలకు రూ.18,200 వేతనంగా చెల్లించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news