ఇది బిర్యానీ కాలం బాస్. ఎవరైనా హోటల్ కు వెళ్లినప్పుడు బిర్యానీ ఆర్డర్ చేస్తే ముందుగా చెప్పే మాట ఏంటో తెలుసు కదా. బాస్.. లెగ్ పీస్ వేయి అంటారు. చాలామందికి లెగ్ పీస్ అంటే ఇష్టం. అందుకే బిర్యానీలో లెగ్ పీస్ తినాలని చాలామంది ఆశపడుతుంటారు. అలాగే ఓ వ్యక్తి కూడా హోటల్ లో ఓనర్ ను లెగ్ పీస్ కావాలన్నాడు. దానికి ఓనర్ తిరస్కరించాడు. అంతే చిర్రెత్తుకొచ్చిన ఆ కస్టమర్ ఏకంగా తన మనుషులను పిలిపించి మరీ.. ఆ ఓనర్ ను చితక్కొట్టాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకున్నది. హోటల్ ఓనర్ ను వాళ్లు చితకబాదిన ఘటన హోటల్ లోని సీసీకెమెరాలో రికార్డయింది. అంతే కాదు.. వాళ్లను అడ్డుకోవడానికి వచ్చిన స్థానికులను కూడా కత్తితో బెదిరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.