భార‌త్‌లో క‌రోనా వ్యాక్సిన్ ఉచితంగానే పంపిణీ: కేంద్ర మంత్రి హ‌ర్ష వ‌ర్ధ‌న్

-

క‌రోనా వైర‌స్‌కు గాను ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థ‌లు సంయుక్తంగా క‌లిసి రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్‌ను భార‌త్‌లో సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఉత్ప‌త్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో సీర‌మ్ ఇనిస్టిట్యూట్ త‌మ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను దేశంలో అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా అందుకు గాను శుక్ర‌వార‌మే అనుమ‌తి ల‌భించింది. అయితే ఈ వ్యాక్సిన్‌ను దేశంలో ఉచితంగానే పంపిణీ చేయ‌నున్నారు.

covid vaccine is free in india says central minister

సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఉత్ప‌త్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్క డోసు ధ‌ర రూ.300, ఒక వ్య‌క్తికి డోస్ ధ‌ర రూ.700 గా నిర్ణ‌యించారు. అయితే ఈ ధ‌ర‌లు ప్ర‌భుత్వానికి వ‌ర్తిస్తాయి. ప్రైవేట మార్కెట్ల‌కు ఇంత‌క‌న్నా ఎక్కువ ధ‌ర‌కే వ్యాక్సిన్‌ను విక్ర‌యించ‌నున్నారు. కానీ ఈ వ్యాక్సిన్‌ను దేశంలోని ప్ర‌జ‌ల‌కు ఉచితంగానే పంపిణీ చేయ‌నున్నారు. ఇదే విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష వ‌ర్ధ‌న్ స్ప‌ష్టం చేశారు. క‌రోనా వ్యాక్సిన్‌ను దేశ ప్ర‌జ‌ల‌కు ఉచితంగానే అందిస్తామ‌న్నారు.

కాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తదుప‌రి అనుమ‌తుల కోసం డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి అభ్య‌ర్థ‌న పంపించారు. అక్క‌డి నుంచి అనుమ‌తి వ‌చ్చిన వెంట‌నే వ్యాక్సిన్ పంపిణీ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. శ‌నివారం దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 259 చోట్ల క‌రోనా వ్యాక్సిన్ పంపిణీకి డ్రై ర‌న్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌న‌వ‌రి 6 నుంచి వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తార‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news