గత ఏడాది విడుదలైనట్లుగానే ఈ ఏడాదిలోనూ అనేక అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేసేందుకు కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ముఖ్యంగా 5జీ త్వరలో అందుబాటులోకి రానుండడంతో ఆ టెక్నాలజీ కలిగిన ఫోన్లను రూపొందించే పనిలో పడ్డాయి. అయితే ఈ ఏడాదిలో ఫోన్లను కొనాలనుకునే వారు మాత్రం ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేమిటంటే..
* 5జీ ఫోన్లను కొనాలనుకునే వారు కొంత కాలం వరకు ఆగడం మంచిది. ఎందుకంటే 5జీ ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. దేశంలో రిలయన్స్ జియో ఈ ఏడాది చివరి వరకు 5జీని అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉంది. కనుక 5జీ ఫోన్లే కావాలనుకుంటే అప్పటి వరకు వేచి చూడడం మంచిది. అప్పటి వరకు తక్కువ ధరలకే చక్కని ఫీచర్లు కలిగిన 5జి ఫోన్లు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంది. కనుక 5జి ఫోన్లను కావాలనుకునే వారు అప్పటి వరకు వేచి చూడడం మంచిది.
* 5జి ఫోన్లు అవసరం లేదు, ఇతర ఫోన్లు కావాలనుకునేవారు మార్కెట్‌లో ఉన్న ఫోన్లను పోల్చి చూసి తమకు అందుబాటులో తక్కువ ధరకు మంచి ఫీచర్లను కలిగిన ఫోన్లను కొనుగోలు చేయాలి. ఈ విషయంలో ఐఫోన్లు కావాలనుకునే వారు కొత్తగా విడుదలైన ఐఫోన్ 12 ఫోన్ మోడల్స్ ను కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా ఈ ఫోన్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఆన్‌లైన్‌లో ప్రత్యేకమైన సేల్స్ ను పెట్టినప్పుడు వీటిని తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఇక ఐఫోన్ 11, ఎక్స్ఆర్, ఐఫోన్ ఎస్ఈ 2020 ఫోన్లు కూడా ఉత్తమ ప్రదర్శనను ఇస్తాయి. అలాగే తక్కువ ధరలకే సేల్స్‌లో లభిస్తాయి. వీటిని కూడా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.
* ఆండ్రాయిడ్ ఫోన్లను కొనాలని అనుకునే వారు ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 6జీబీ వరకు ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఫీచర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. మార్కెట్‌లో ఈ ఫీచర్లు కలిగిన ఫోన్లు రూ.15వేల లోపే లభిస్తున్నాయి. ఇక ఈ ఫీచర్లతోపాటు ఫోన్లలో హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాకుండా డెడికేటెడ్ స్లాట్ ఉండేలా చూసుకోవాలి. దీంతో ఫోన్‌లో వచ్చే ఇంటర్నల్ స్టోరేజ్‌కి తోడు అదనంగా స్టోరేజ్ పొందవచ్చు. అలాగే బ్యాటరీ పవర్ కనీసం 4000 ఎంఏహెచ్ ఉండేలా చూసుకోవాలి. దానికి ఫాస్ట్ చార్జింగ్ ఉందా, లేదా చెక్ చేయాలి. ఈ ఫీచర్లు ఉన్న ఫోన్లను తీసుకుంటే చక్కని పెర్ఫార్మెన్స్‌ను పొందవచ్చు. ఫోన్లలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఫోన్లు వేగవంతంగా పనిచేస్తాయి.