మనం ఇప్పుడు తినే పిజ్జా వెనక చాలా చరిత్ర ఉంది. ఇది కనుక చూశారంటే అవాక్ అవుతారు. వివరాల్లోకి వెళితే.. ప్రపంచంలో తొలిసారి పిజ్జా తయారైంది క్రీస్తు పూర్వం 997 సంవత్సరంలో తినడం జరిగింది. ఇటలీలోని గేటా నగరంలో మొదటి సారి పిజ్జాను తయారు చేశారు. ఆ తర్వాత ఇటలీ మొత్తం ఈ ఫుడ్ విస్తరించింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..? పిజ్జాలు గ్రీకు, ఈజిప్టుల ఆహారం. అలానే క్రీస్తు శకం 18వ శతాబ్దం నుంచి ఇటీలియన్లు పిజ్జాల్లో టమోటాలు యాడ్ చేయడం ప్రారంభించారు.
ఆలివ్ ఆయిల్, మసాలాలలో కూడా వాటిని కుక్ చేసుకునే వారు. ఇలా ఒకటి కాదు అనేక రకాలని ప్రారంభించడం జరిగింది. 1835లో ది త్రీ ముస్కిటీర్స్ పుస్తక రచయిత కూడా పిజ్జా ప్రస్తావన తెచ్చారు. ఇటలీలోని నాపిల్స్ పర్యటించినప్పుడు అక్కడ పేద వారు వేసవిలో పుచ్చకాయలు తినేవారని శీతకాలంలో పిజ్జాలు తినేవారని చెప్పారు. అంటే పిజ్జా ఎప్పుడెప్పుడు నుండి ఉందో అర్ధం అయ్యిందా…? 1933లో. ప్యాస్టీ లన్సెరీ అనే వ్యక్తి న్యూయార్క్ లో పాస్టీస్ పిజేరియా రెస్టారెంట్లో తొలిసారి పిజ్జా అమ్మకానికి ప్రారంభం చెయ్యడం జరిగింది.
మార్గరెట్ పేరుతో ఓ పిజ్జా ఉంది. సావోయ్ క్వీన్ మార్గరెట్ 1889లో టమోటాలు, చీజ్, బాసిల్‌తో టాపింగ్ చేసి పిజ్జా తయారు చేసి ఇవ్వాలని తన చెఫ్‌కు చెప్పారు. అందుకే ఇప్పటికి దాని పేరు మార్గరెట్ పిజ్జానే. పిజ్జాను ప్రతీ రోజు తినడం వల్ల ఓయిసోఫజీల్ క్యాన్సర్ వచ్చే అవకాశం 59శాతం తగ్గుతుందని ఇటాలియన్ పరిశోధకులు తేల్చారు.