బ్రేకింగ్ : రేవంత్ రెడ్డి అరెస్ట్

ఎల్బీ నగర్ సర్కిల్ పరిధిలోని వాసవి నగర్ లో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెప్పిన కంటే ముందే ప్రారంభించి పోయారు అంటూ రేవంత్ రెడ్డి మరియు ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.  స్థానికంగా ఉన్న అధికారులు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లతో వాగ్వాదానికి దిగారు ఎంపీ రేవంత్ రెడ్డి. ప్రతిసారి ఇలాగే తప్పించుకు పోయే ప్రయత్నం చేస్తున్నారని, టైం కంటే ఎలా ముందు ప్రారంభోత్సవం చేస్తారంటూ కార్యకర్తలతోపాటు ర్యాలీగా రోడ్డు మీద వచ్చిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు  కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

revanth-reddy
revanth-reddy

అక్కడే ఉన్న అధికార పార్టీ మంత్రి మల్లా రెడ్డి, సుధీర్ రెడ్డి తో ఎంపీ రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపై ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.  12 గంటలకు ప్రారంభోత్సవం ఉండగా ముందు ఎలా చేస్తారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి నీ  నిలదీసిన ఎంపీ రేవంత్ రెడ్డి, కేటీఆర్ సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. కార్యక్రమ ఫ్లెక్సీలను కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చింపేశారు.