జనవరి 15 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ పుష్యమాసం- జనవరి – 15- శుక్రవారం

 

మేషరాశి:ఈరోజు ఆర్థిక సమస్యలు !

ఈరోజు ఆత్మవిశ్వాసంతో పనిచేయాల్సిన సమయం. ఆర్థిక సమస్యలు. స్నేహితుల సలహాలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆఫీస్‌లో అన్ని విషయాలలో మీదే పైచేయి అవుతుంది. సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషం గా గడుపుతారు.

పరిహారాలుః ధనాభివృద్ధి కోసం సూర్యుడికి ఎరుపు పువ్వులు పట్టుకొని నమస్కారం చేయండి.

 

todays horoscope

వృషభ రాశి:ఈరోజు కొత్త ఒప్పందాలు లబ్ది చేకూరుస్తాయి !

ఈరోజు మీకు క్రొత్త ఒప్పందాలు బాగా లబ్దిని చేకూరుస్తాయి. మీ తెలివితేటలు, మాటలతో సమాజంలో పేరుగడస్తారు. ధైర్యంతో వేసే  ముందడుగులు, నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ప్రారంభంలో అలసిపోయినట్టుగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబంలో సంతోషం, ఆనందంగా ఉంటారు. పిల్లల చదువుల కోసం ఆందోళన పడుతారు. పనులలో పురోగతి ఉంటుంది. వైవాహికంగా చాలా సంతోషంగా ఉంటారు.

పరిహారాలుః అనుకూలమైన ఫలితాల కోసం ఇష్టదేవతరాధన చేయండి.

 

మిథున రాశి:లాభాలు వస్తాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు, ట్రేడ్వర్గాల వారికి లాభాలు వస్తాయి. బంధువులు, స్నేహితుల నుండి అనుకోని కానుకలు, బహుమతులు అందుతాయి. పని వత్తిడి, కొంతమందికి వృత్తిపరమయిన అభివృద్ధి. ఈరోజు మీజీవితభాగస్వామితో గడపటానికి మీకుసమయము దొరుకుంతుంది.

పరిహారాలుః  ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రావిచెట్టు ప్రదక్షణాలు చేయండి.

 

కర్కాటకరాశి:అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి !

ఈరోజు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందకండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఆర్ధికంగా ఎటువంటి ఢోకా ఉండదు. ఎక్కువ సమయాన్ని పిల్లలతో గడపండి. కష్టపడి పని చెయ్యడం ద్వారా మీరు లక్ష్యాలను చేరుకుంటారు. మీ తల్లిదండ్రులు పెద్దలను ఏదైనా వస్తువుతో ఆశీర్వదిస్తారు. వైవాహిక జీవితపు ఆనందాన్ని ఈరోజు మరింత పెంచుతుంది.

పరిహారాలుః ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు శ్రీ ధన్వంతరీ స్తోత్రం పారాయణం చేయండి.

 

సింహరాశి:క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి !

ఈరోజు కోపతాపాలకు దూరంగా ఉండండి. గ్రహచలనాల రీత్యా ఆందోళన ఎదురవుతాయి. చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి. మీకు తెలిసిన వారి ద్వారా

క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. అనుకున్నంతగా ఫలితాలు రాలేదని నిరాశకు గురికాకండి. అనవసర వాగ్వివాదాలకు సమయమును వృధాచేస్తారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు.

పరిహారాలుః  ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి పశువులకు గోధుమలు బెల్లం ఇవ్వండి.

 

కన్యా రాశి:మీ ప్రవర్తన వల్ల అనుకూల ఫలితాలు !

ఈరోజు మీ ప్రవర్తన వల్ల అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనవరస ఖర్చులు పెడుతారు, దీనివల్ల ఇబ్బందులు ఎదరుకునే అవకాశం ఉంది. కుటుంబంలో సామరస్యత కోసం ఓపికను ప్రదర్శించాల్సిన రోజు ఇది. పిల్లల చదువుకోసం ధనాన్ని వెచ్చిస్తారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః వ్యాపారంలో లాభాలు పొందేందుకు ఈరోజు ఆకుపచ్చ లేదా గ్రీన్‌ దుస్తులు ధరించండి.

 

తులారాశి:మీ ఖర్చులను తగ్గించుకోండి !

ఈరోజు మీ ఖర్చులను తగ్గించుకోండి. అవసరమైనవాటి కోసమే ధనాన్ని వెచ్చించండి. ఆర్థికాభివృద్ధి కోసం ఆలోచనలు చేస్తారు. అదనంగా ఉండటానికి పిల్లలతో గడపండి. చిన్నపాటి అవరోధాలతో, ఈరోజు ఉత్తమమైనదిగా అనిపిస్తుంది. వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన విషయాలు ఈరోజు జరుగుతాయి.

పరిహారాలుః విజయవంతమైన వ్యాపార జీవితం కోసం శ్రీలక్ష్మీదేవి దగ్గర ఆవునెయ్యి దీపం పెట్టండి.

 

వృశ్చికరాశి:అనవసర విషయాలలో తలదూర్చకండి !

ఈరోజు మీరు విలువలతో గడపండి. అనవసర విషయాలలో తలదూర్చకండి. ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు, సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. వ్యాపారవేత్తలు వారి స్నేహితుడి సహాయం వలన ఆర్ధికప్రయోజనాలు పొందుతారు. కష్టపడి సరైన పధ్దతిలో ప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచిఫలితాలను అందుకుంటారు. ఆఫీసులో పనిపూర్తిచేయడానికి అధిక సమయం వెచ్చిస్తారు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే ఇబ్బంది పెడుతుంది.

పరిహారాలుః పేద ప్రజలకు పప్పులు పంపిణీ చేయండి, దీనివల్ల గురు అనుగ్రహం కలుగుతుంది.

 

ధనుస్సు రాశి:వ్యాపార భాగస్థులు సహకరిస్తారు !

ఈరోజు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. క్రొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించడానికి మంచిరోజు. పిల్లలతో ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు, అలాగే మీరు వారితోకలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తిచెయ్యడానికి పనిచెయ్యండి. వైవాహిక జీవితానికి సంబంధించి ఈరోజు బాగుంటుంది.

పరిహారాలుః కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వాతావరణం కోసం శ్రీలక్ష్మీ సూక్తం పారాయణం చేయండి.

 

మకరరాశి:వివాదాలకు దూరంగా ఉండండి !

ఈరోజు అనుకూ, ప్రతికూల మిశ్రమాలుగా ఉంటుంది. అనవసర ఖర్చులు, అనుకోని బిల్లులు మీ ఖర్చును పెంచుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండండి. గ్రహచలనం రీత్యా, అనుకూలంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి శుభవార్తలు అందగలవు. ప్రమోషన్‌ వచ్చే అవకాశాలున్నాయి. మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో సంతోషపెట్టనున్నారు.

పరిహారాలుః  కుటుంబ సఖ్యతో కోసం శ్రీ లక్ష్మీనరసింహ కరావలంబం పారాయణం చేయండి.

 

కుంభరాశి:తెలిసిన వారి ద్వారా అవకాశాలు !

 

ఈరోజు అత్యుత్తమమైన రోజు. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల. చాలా కాలంగా చెల్లించని బకాయిలు చెల్లింపు చేయడానికి ఈరోజు తగిన ధనం మీ దగ్గర ఉంటుంది. ఈరోజు రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్ఠను నాశనం చేస్తాయి. మీకు తెలిసిన వారి ద్వారా అవకాశాలు వస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఈరోజు అనుకోని విధంగా సంతోషపెడుతుంది.

పరిహారాలుః ‘ఓం భుమాయ నమహా’ 11 సార్లు రాసి సంతృప్తికరమైన జీవితం పొందండి.

మీనరాశి:ఆర్ధికపరిస్థితి చాలా బాగుంటుంది !

మీ ఆర్ధికపరిస్థితి చాలా బాగుంటుంది. దీనితోపాటు మీరు మీ పాతరుణాలను చెల్లించి సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఆనందమయంగా ఉంటుంది. మీసమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. రోజంతా వాడివేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు.

పరిహారాలుః అనుకూలమైన రోజు కోసం శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

 

  • శ్రీ

 

 

Read more RELATED
Recommended to you

Latest news