వకీల్ సాబ్ టీజర్ పై వాళ్ళలో భిన్నాభిప్రాయాలు.. కారణం ఏంటంటే

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ టీజర్, రిలీజై యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ని తెర మీద చూసేసరికి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. ఈ నేపథ్యంలో మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. ఐతే వకీల్ సాబ్ టీజర్ పై కొద్దిమందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దానికి కారణం ఈ సినిమా పింక్ సినిమాకి రీమేక్ కావడమే. బాలీవుడ్ పింక్ సినిమాకి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు.

హిందీ పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ కి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కేవలం అమ్మాయిలకి సాయం చేసే లాయర్ గానే కనిపిస్తాడు. కథ మొత్తం ముగ్గురు అమ్మాయిల మీదే నడుస్తుంది. కానీ వకీల్ సాబ్ టీజర్ చూస్తే మాత్రం ఏ కోశాన అమ్మాయిలు కనిపించలేదు. అదే ఫెమినిస్టులకి నచ్చడం లేదు. ఒక్క ఫ్రేములో కూడా వాళ్ళు కనిపించకపోయే సరికి బాధపడుతున్నారు. మరి ఒరిజినల్ సినిమాకీ, రీమేక్ కి ఏమైనా మార్పులు చేసారా? ఎంతవరకు చేసారన్నది సినిమా చూస్తేనే గానీ తెలియదు.

Read more RELATED
Recommended to you

Latest news