త‌ప్పులో కాలేసిన శాంసంగ్‌.. ఐఫోన్ నుంచి ట్విట్ట‌ర్ పోల్‌.. నెటిజ‌న్ల ట్రోలింగ్‌..

-

ఒక ఫోన్ల త‌యారీకి చెందిన కంపెనీలో ఆ కంపెనీకి చెందిన ఫోన్ల‌ను కాకుండా ఉద్యోగులు వేరే కంపెనీకి చెందిన ఫోన్ల‌ను వాడితే ఎలా ఉంటుంది ? కంపెనీకే కాదు, అటు ఆ ఫోన్ల‌కు కూడా వినియోగ‌దారుల్లో చెడ్డ పేరును తీసుకువ‌స్తుంది. అయితే ఈ విష‌యాన్ని శాంసంగ్ కంపెనీ గ‌మ‌నించ‌న‌ట్లుంది. అందుక‌నే త‌ప్పులో కాలేసింది. ఇంత‌క అస‌లు ఏం జ‌రిగిందంటే ?

samsung trolled for tweeting from iphone for its galaxy s21 promotion

శాంసంగ్ కంపెనీ తాజాగా గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ఫోన్ల‌ను విడుద‌ల చేసింది తెలుసు క‌దా. వాటికి గాను ట్విట్ట‌ర్‌లో ప్ర‌మోష‌న్ పెట్టింది. ఒక పోల్‌ను శాంసంగ్ నిర్వ‌హించింది. అయితే ఆ పోల్ పెట్టేందుకు శాంసంగ్ ఐఫోన్ లో ట్విట్ట‌ర్ ఖాతాను ఉప‌యోగించింది. ఆ విష‌యాన్ని ట్వీట్ కింది భాగంలో గ‌మ‌నించ‌వ‌చ్చు. ట్విట్ట‌ర్ ఫ‌ర్ ఐఫోన్ అని ఐఫోన్‌లో ట్విట్ట‌ర్ యాప్ ఉప‌యోగించి ఆ పోల్ పెట్టినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై నెటిజ‌న్లు స్పందించారు.

శాంసంగ్ కంపెనీ త‌న కొత్త ఫోన్ల‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌డం ఓకే. కానీ త‌న ఫోన్ల‌తో కాకుండా ఐఫోన్‌తో ట్వీట్ చేయ‌డం ఏమిట‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. శాంసంగ్ త‌ప్పు చేసి దొరికిపోయింది క‌నుక ఆ కంపెనీని వారు ఆడుకుంటున్నారు. ఆ కంపెనీని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అంటే శాంసంగ్ కంపెనీలో ఉద్యోగులే ఆ కంపెనీకి చెందిన ఫోన్ల‌ను వాడ‌క‌పోతే ఇక ప్ర‌జ‌లు ఎలా వాడుతారు ? క‌దా.. అందుక‌నే నెటిజ‌న్లు శాంసంగ్‌ను విమ‌ర్శిస్తున్నారు. ఇక త‌ప్పు తెలుసుకున్న శాంసంగ్ వెంట‌నే పోల్‌ను స‌రి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news