సోనూ సూద్ టైలర్ షాప్.. ఇక్కడ అన్నీ ‘ఫ్రీ’గా కుట్టబడును !

-

రీల్ లైఫ్ విలన్ అయిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోనూ సూద్ ఏం చేసినా వెంటనే వైరల్ అవుతోంది. తాజాగా  సోనూ సూద్ ఓ మూవీ సెట్స్ లో టైలర్ అవతారం ఎత్తారు. అక్కడే ఉన్న కుట్టు మిషన్ పై సరదాగా దుస్తులు కుట్టారు. ఆయన కాసేపు టైలరింగ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశారు.

అంతే కాదు సోనూ సూద్ టైలరింగ్ షాప్.. ఇక్కడ అన్నీ ఉచితంగా కుట్టబడును అంటూ పేర్కొన్నాడు. ప్యాంట్ కుట్టమని ఇస్తే అది నిక్కర్ అవ్వచ్చేమో అంటూ సరదాగా ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఈ తతంగం అంతా హైదరాబాదులో ఓ సినిమా షూటింగ్ గ్యాప్ లో జరింగింది.  దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news