ఉన్నదంతా కోల్పోయినా.. మళ్లీ గెలిచి నిరూపించింది ఈమె..!

-

మీరు కష్టపడి సంపాదించుకున్నదంతా ఒక్కసారిగా పోతే మీరేం చేస్తారు ? అలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తే దారుణంగా ఉంటుంది. కష్టం మొత్తం పోయినందుకు ఎంతగానో బాధ కలుగుతుంది. తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తారు. అయితే ఆమె కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితినే అనుభవించింది. కానీ ఆమె చాలా త్వరగా దాన్నుంచి బయట పడింది. తిరిగి మొదట్నుంచీ కష్టపడడం ప్రారంభించింది. తరువాత మళ్లీ తాను ఒకప్పుడు ఉన్న స్థానానికి చేరుకుంది. ఉత్తమ వ్యాపారి అవార్డును కూడా గెలుచుకుంది.

women started from zero now owner to 4 stores

తమిళనాడులోని మదురై ఉజలంపెట్టి ప్రాంతం త్రిసూర్‌కు చెందిన ఇళవరసి అనే మహిళకు చెందిన కుటుంబం స్వీట్లను తయారు చేయడంలో పేరుగాంచింది. వారి స్వీట్లకు అక్కడ మంచి డిమాండ్‌ ఉండేది. దీంతో అనతి కాలంలోనే వారు వ్యాపారంలో వృద్ధిలోకి వచ్చారు. అయితే ఇళవరసి రూ.50 లక్షలు అప్పుగా తీసుకుని ఒక సూపర్‌ మార్కెట్‌ స్టోర్‌ను ప్రారంభించింది. కానీ 2011లో ఆమె స్టోర్‌లో దొంగలు పడి మొత్తం దోచుకున్నారు. చాలా నష్టం వచ్చింది. దీంతో పరిస్థితి మొదటికి వచ్చింది. అయినప్పటికీ ఆమె బాధపడలేదు.

తరువాత ఆమె కేవలం రూ.100 పెట్టుబడితో అశ్వతి హాట్‌ చిప్స్‌ను ప్రారంభించింది. అత్యంత నాణ్యంగా, పరిశుభ్రంగా, రుచికరంగా చిప్స్‌ను తయారు చేసి స్థానికంగా విక్రయించడం మొదలు పెట్టింది. అంతే.. ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. అందులో ఆమె విజయం సాధించింది. ప్రస్తుతం త్రిసూర్‌లో అశ్వతి హాట్‌ చిప్స్‌కు చెందిన స్టోర్లు నాలుగు ఉన్నాయి. ఇలా ఆమె మళ్లీ సున్నా నుంచి ఈ స్థాయికి అంచెలంచెలుగా ఎదిగింది. ఈ క్రమంలోనే 2019లో ఇళవరసి ఇంటర్నేషనల్‌ పీస్‌ కౌన్సిల్‌ యూఏఈ అవార్డ్‌ అయిన బెస్ట్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌ అవార్డును గెలుచుకుంది. జీవితంలో అట్టడుగు స్థాయికి పడిపోయినా మళ్లీ గెలవవచ్చని ఈమె నిరూపించింది. చాలా మందికి ఈమె జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం.

Read more RELATED
Recommended to you

Latest news