విజయవాడ – హైదరాబాద్ హైవే మీద భారీ ట్రాఫిక్ జాం

-

సంక్రాంతి సెలవులు ముగియడం, వీకెండ్ కావడంతో 65వ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వాహనాల రద్దీ భారీగా ఉంది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్ర ప్రాంతానికి..తిరిగి నగరానికి వస్తున్నారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. టోల్ ప్లాజా సిబ్బంది అదనపు కౌంటర్ ఏర్పాటు చేశారు.

వాహనాలు అధిక సంఖ్యలో రావడంతో…బారులు తీరాయి. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్ వైపు 9, విజయవాడ వైపు 5 టోల్ గేట్స్ ఓపెన్ చేశారు. నల్లగొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు 7, విజయవాడ వైపు 5 గేట్స్ ఓపెన్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news