బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తను కలిసిన, ప్రభుత్వ అధికారిని కలిసిన కుటుంబ పాలన పోవాలి బీజేపీ అధికారంలోకి రావాలనే చర్చ జరుగుతోందని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గతంలో మాట్లాడాలని అంటే పోన్ ట్యాప్ అవుతుందని భయపడే వారు.. కాని ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుందని ఫ్రీ గా మాట్లాడుతున్నారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓట్లు అడిగే పరిస్థితి లేదన్న ఆయన గ్రేటర్ ఎన్నికలు న్యాయ, ధర్మ బద్దంగా జరిగి ఉంటే పలితాలు మరోలా ఉండేవి… సింగిల్ డిజిట్ టీఆర్ఎస్ కి వచ్చేదన్న ఆయన మజ్లీస్ తో పొత్తు పెట్టుకోవడం తో ఆ మాత్రం సీట్లు వచ్చాయని అన్నారు. ప్రభుత్వ టీచర్లు లేక ఏ ఎన్నికలు జరగలేదు.. సరైన శిక్షణ లేని వారిని ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ తీసుకొచ్చి కూర్చోబెట్టారని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజల్లో కి వెళ్ళాలి.. ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది.. పశ్చిమ బెంగాల్ లో మాదిరిగా ఎదుర్కోవాలి.. ప్రభుత్వం పై పోరాటం చేయాలి.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై ఆందోళన చేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.