గత ఏడాది నుంచి ప్రపంచాలన్నే వణుకు పుట్టించిన కరోనా వైరస్ ఆనవాళ్లపై రోజుకొక వెలువడుతున్న ప్రకటనలతో చైనా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులకు చైనాలో పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన ఈ ప్రకటన మరింత కలవర పెడుతుంది. బీజింగ్‌కు అతి సమీపంలోని తియాన్జిన్ అనే ప్రాంతంలో ఉన్న ఓ కంపెనీలో తయారైన ఐస్‌క్రీంలో కరోనా ఆనవాళ్లు కన్పించాయని ఉదంతం వెలుగుచూసింది. దీంతో అప్రమత్తమైన ఆ సంస్థ ఆ బ్యాచ్‌లో తయారైన వేల సంఖ్యల కార్టన్లను వెనక్కి తీసుకుంది.
ఇప్పటి దాకా 390 కార్టన్లు మాత్రమే విక్రయించారని, 29వేల కార్టన్ల ఐస్‌క్రీంలు అలాగే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే.. 390 కార్టన్ల ఐస్‌క్రీంలు ఎక్కడెక్కడా విక్రయించారనేది గుర్తిస్తున్నారు. న్యూజిల్యాండ్, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న పిండి పదర్థాలను ఆ ఐస్‌క్రీంలో వాడినట్లు చైనా అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఈ ఐస్‌క్రీం, తయారీ చేసేటప్పుడు గానీ, విక్రయాలప్పుడు గానీ, తినడం మూలంగా ఎవరికైన వైరస్ సోకిందా లేదా అనే విషయంలో స్పష్టం లేదని అధికారులు తెలిపారు.
మరో వాదన ..
ఆహార పదర్థాలతో వైరస్ సోకడం చాలా తక్కువని, డబ్ల్యూహెచ్‌ఓతో పాటు అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నాయి. అయితే విదేశాల నుంచి వస్తున్న వారు తమ వెంట తీసుకొస్తున ఆహార పదర్థాల కారణంగానే వైరస్ వ్యాప్తి చెందుతుందని చైనా అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో చైనా అవలంభిస్తున్న తీరుపై అంతర్జాతీయ నిపుణుల బృందం మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.