తెలుగు సినీపరిశ్రమలో దొరస్వామిరాజుకి అభిరుచి కలిగిన నిర్మాతగా మంచి పేరుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా అందరూ గుర్తుంచుకునే సినిమాలు చేశారాయన. అయితే వయోభారం కారణంగా ఆయన కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన కొద్ది సేపటి క్రితం ఆయన కన్ను మూశారు. వయో భారం కారణంగా ఆయన అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఆయన కేర్ బంజారా హాస్పిటల్ లో వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు..
తెలుగులో ఆయన కిరాయి దాదా, సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, మాధవయ్యగారి మనవడు, అన్నమయ్య, సింహాద్రి, కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను, వెంగమాంబ, శ్రీ వాసవి వైభవం, విజేత లాంటి సినిమాలను ఆయన నిర్మించారు. అంతేకాక ఆయన డిస్ట్రిబ్యూటర్ గా దాదాపు 500కు పైగా సినిమాలను సీడెడ్ రీజియన్ లో డిస్ట్రిబ్యూట్ చేశారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమాలు గురుశిష్యులు, ప్రేమాభిషేకం, అనుబంధం, కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ, జానకిరాముడు, సింహస్వప్నం, ఇద్దరూ ఇద్దరే, చంటి, చిన్నల్లుడు, చిలక్కొట్టుడు, ఆటో డ్రైవర్, ఆంధ్రావాలా లాంటి సినిమాల్ని ఆయన సీడెడ్ రీజియన్ లో రిలీజ్ చేశారు.