ట్విట్టర్ వేదికగా బాబాయి అశోక్ గజపతిరాజు మీద సంచైత గజపతి తీవ్ర విమర్శలు చేశారు. ఆనాడు ఎన్టీఆర్ ని వెన్ను పోటు పొడిచిన వ్యక్తుల్లో చంద్రబాబుతో పాటు అశోక్ గజపతిరాజు కూడా ఉన్నారంటూ విమర్శలు చేశారు. రాజకీయ సూత్రాలు, నైతిక విలువలను, ప్రజలిచ్చిన తీర్పును మంట కలిపిన ఆయన..ఈరోజు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అంటూ కొనియాడడం.. ఒక వ్యక్తిని హత్య చేసిన హంతకుడు…అదే వ్యక్తి దూరమయ్యాడు అని కన్నీరు కార్చినట్లుగా ఉందంటూ సంచైత గజపతిరాజు ఎద్దేవా చేశారు.
ఇక టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టిఆర్ 25వ వర్ధంతి సందర్భంగా కోట జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నగారు ముఖ్యమంత్రి అయ్యే వరకు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాలేదని అన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని అన్నారు.