తెలంగాణలో టీడీపీ బలోపేతం.. ఇక పై అన్ని ఎన్నికల్లో పోటీ !

-

నేడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సంధర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో  నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ ను కూల్చాలన్న వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు, ఎన్టీఆర్ ఘాట్ ను కూల్చటమంటే మన సంస్కృతిని మనం‌ కూల్చుకోవటమేనని అన్నారు. కూల్చటం వంటి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని ఆయన అన్నారు, ఎన్టీఆర్ పేరు చెబితే శత్రువుల గుండెల్లో రైళ్ళు పరుగెడతాయన్న ఆయన ఎన్టీఆర్ కు భారతరత్న ఆలస్యమైన మాట వాస్తవం అని అన్నారు.

ఎన్టీఆర్ శత జయంతి రాబోతోంది. అప్పటిలోగా భారతరత్న సాధిస్తామని ఆయన అన్నారు. ఎన్టీఆర్ కు బిరుదులు కొత్త కాదు.. ఆయన దేశానికే గర్వకారణమని ఆయన అన్నారు. టిడిపి పుట్టింది హైదరాబాద్ లోనే అని పేర్కొన్న చంద్రబాబు టిడిపిని తెలంగాణలో బలోపేతం చేస్తామని అన్నారు అలాగే ఇకమీదట ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు.. రాజకీయాల కోసం ఎన్టీఆర్ పేరు వాడడం సరికాదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news