మళ్ళీ ఉమాని టార్గెట్ చేసిన కొడాలి.. రాత్రి నుండి 10 సార్లు ఫోన్ చేశా !

-

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీమంత్రి దేవినేని ఉమాపై తనదైన శైలిలో మరోసారి పొరసరఫరాల శాఖా మాత్యులు కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. దీక్షకు పోలీసులు ఒప్పుకోరని తెలిసే దీక్షా నాటకం ఆడాడని అన్నారు. దేవినేని ఉమా దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

మీడియా సమక్షంలోనే ఇరువురి మేనిఫెస్టో గురించి చర్చిద్దామని ఆయన అన్నారు. ఒకవేళ ఆ చర్చలో అక్కడే కొట్టక పోతే నేను రాష్ట్రం విడిచి వెళ్ళొపోతానని ఆయన అన్నారు. సొల్లు ఉమా సొల్లు కబుర్లు చెబుతాడన్న కొడాలి నాని రాత్రి నుండి 10 సార్లు ఫోన్ చేశా.. బహిరంగ చర్చకు సిద్ధమని అయినా ఇలా వెళ్లి అరెస్ట్ అయ్యాడని ఆయన అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news