సుశాంత్ సింగ్ రాజ్ పుత్, బాలీవుడ్ లో ఎంతో ఫ్యూచర్ ఉన్న ఒక తార. ఏమైందో ఏమో తెలియదు కానీ అనుమానాస్పద స్థితిలో ఆయన శవమై తేలాడు. నిజానికి జూన్ 14న ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మురికి వేలాడుతూ కనిపించారు. తొలుత ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దానిని అనుమానాస్పద మృతి గా మార్చారు.
నెపోటిజం కారణంగా అవకాశాలు తగ్గిపోయి ఆయన మరణించారని కొందరంటే లేదు రియా చక్రవర్తి చేసిన దారుణ మోసం తట్టుకోలేక మరణించాడని కొందరంటారు. అయితే ఆయన ఎందుకు మరణించాడు ? అది హత్య ? లేక ఆత్మహత్య ? అనేది తేల్చడానికి సిబిఐ రంగంలోకి దిగింది. దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా ఆయన ఆత్మహత్యకు కారణం ఏమిటి అనేది తెలియలేదు. ఇక ఈ రోజు సుశాంత్ జయంతి కావడంతో ఆయన ఫ్యాన్స్ ఈరోజు సుశాంత్ డే అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరి ఆయన ప్రథమ వర్ధంతి నాటి కైనా ఆయన మృతి మిస్టరీ వీడుతుందా ఏమో చూడాలి మరి.
Love you Bhai ❤️❤️❤️ You are part of me and will always remain so… #SushantDay pic.twitter.com/nDU8Zkeipp
— Shweta Singh Kirti (@shwetasinghkirt) January 20, 2021