ఆ మాజీ మంత్రి అలకవీడి నియోజకవర్గం వెతుక్కునే పనిలో పడ్డారా

-

ఎన్నికల్లో ఓటమితో ఆమాజీ మంత్రి టీడీపీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. కానీ మనసు మార్చుకున్నారో ఏమో.. శాసనమండలిలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా డోన్‌, ప్యాపిలీలో పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని తాను టీడీపీలో యాక్టీవ్ గా ఉన్నా అన్న మెసేజ్ పంపారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారట మాజీ అమాత్యులు.

కేఈ ప్రభాకర్‌ మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ. కేఈ కుటుంబం కర్నూలు జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కు. ఈ జిల్లాలో ఎప్పటి నుంచో రాజకీయ వైరం ఉన్న కోట్ల ఫ్యామిలీ కూడా గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరింది. రెండు బలమైన కుటుంబాలు టీడీపీలో ఉండటంతో మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి తిరుగే ఉండదని లెక్కలేసుకున్నారు తెలుగు తమ్ముళ్లు. కానీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయారు. ఎన్నికల్లో కలిసి పనిచేసిన కేఈ..కోట్ల కుటుంబాలు ఓడిన తర్వాత కాస్త ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నాయట.

కర్నూలు టీడీపీలో కోట్ల కుటుంబం ఆధిపత్యం ఎక్కువైందని ఆరోపిస్తూ సంవత్సరం క్రితం కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేసే వరకూ వెళ్లారు. ఆ తర్వాత రాజకీయంగా స్థబ్దుగా ఉన్నారు. కానీ ఉన్నట్టుండి యాక్టివ్ అయిన కేఈ ప్రభాకర్ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే కొత్త ఎత్తుగడలు వేస్తున్నారట మాజీ మంత్రి కేఈ ప్రభాకర్. ప్లేస్‌ కూడా ఫిక్స్‌ చేసుకున్నారట. పార్టీలోని ప్రత్యర్థులకు మరో ప్లేస్‌ చూపించారట. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఈ అంశమే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.

డోన్‌ టీడీపీ ఇంఛార్జ్‌గా కేఈ ప్రతాప్‌ ఉన్నారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని కొన్ని నెలలుగా కుటుంబంలో చర్చకు పెట్టారట. ఇదే విషయంపై సోదరులంతా పలు సందర్భాలలో చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే డోన్‌ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రతాప్‌ సైతం వెల్లడించారట. అంతేకాదు ప్రభాకర్‌ను ఇంఛార్జ్‌ను చేయాలని ఆయన కోరారట. ఇది జరిగిన కొద్దిరోజులకే డోన్‌ వెళ్లిన ప్రభాకర్‌ అక్కడి బాధ్యతలు తీసుకోబోతున్నట్టు.. వచ్చే ఎన్నికల్లో డోన్‌ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారట.

మొన్నటి వరకు కోట్ల సుజాత డోన్‌ వెళ్తారని కూడా పార్టీ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. దీంతో డోన్‌ కోట్ల సుజాతకా..కేఈ ప్రభాకర్‌కా అని ఆరా తీస్తున్నారు. అయితే కోట్ల సుజాత ఆలూరు వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే విషయాన్ని ఆమె కార్యకర్తలకు చెప్పారని టాక్‌. అందుకే ఎవరెక్కడ పోటీ చేయాలనే విషయంలో ఎలాంటి వివాదం లేదని అనుకుంటున్నారట. అంతేకాదు.. సుజాత డోన్‌ నుంచి పోటీ చేస్తానంటే తాను ఆలూరు వెళ్తానని.. ఒకవేళ ఆమె ఆలూరును ఎంపిక చేసుకుంటే.. తాను డోన్‌ బరిలో ఉంటానని ప్రభాకర్‌ తెలిపారట.

పైకి ఆయన ఈ మాట చెబుతున్నా.. లోపల మాత్రం డోన్‌కే ఫిక్స్‌ అయినట్టు సమాచారం. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా డోన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి బుగ్గన టార్గెట్ చేస్తూ ప్రభాకర్‌ చేసిన కామెంట్స్ తో కేడర్ కి కూడా క్లియర్ మెసేజ్ పంపారట. వచ్చే ఎన్నికల్లో తానే బరిలో ఉంటున్నట్లు కార్యకర్తలకు చెప్పకనే చెప్పారట.

 

Read more RELATED
Recommended to you

Latest news