తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. తమిళనాడులోని హోసూరులో ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో దోపిడి జరిగింది. హోసూరు-బాగలూరు రోడ్డులో ఉన్న ముత్తూట్ కార్యాలయం తెరుచుకున్న కొద్ది సేపటికే దోపిడీ దొంగలు చొరబడి సిబ్బందిని బెదిరించి భారీ మొత్తంలో బంగారం, నగదు అపహరించుకుపోయారు. దాదాపు 25 కిలోలకు పైగా బంగారం, లాకర్లలో ఉన్న 96వేల డబ్బు దోచుకెళ్లినట్లు ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అపహరణకు గురైన బంగారం విలువ సుమారు రూ.7.5 కోట్లు ఉంటుందని అంచనా. ఈ దోపిడీ చేసిన నలుగురు దోపిడీ దొంగలను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు నుంచి హైదరాబాద్, కర్ణాటకకు పారిపోయేందుకు దోపిడీదారులు ప్రయత్నించారు. సైబరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో దోపిడీ దొంగలను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో చోరీ చేసిన సొత్తును కూడా సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, తెలంగాణ మీదుగా కర్ణాటక పారిపోయేందుకు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ దొంగలు ప్రయత్నించగా వారిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.