శ్రీరామ జనవరి – 24 – పుష్య మాసం – ఆదివారం.
మేష రాశి:ఈరోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి !
ఈరోజు సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో ఉత్తమ మార్కులు తెచ్చుకుంటారు. అప్పుల బాధలు తగ్గి పోతాయి. మొండి బాకీలు వసూలు చేసుకొని ధన లాభం పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఈరోజు గృహ సంబంధ వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
పరిహారాలు: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేసుకోండి.
వృషభ రాశి:ఆరోగ్యంగా ఉంటారు !
ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను సరైన సమయంలో పూర్తి చేసుకొంటారు, కార్యసిద్ధి పొందుతారు. మిత్ర లాభం పొందుతారు. అనారోగ్య సమస్యలు తగ్గించుకుని ఆరోగ్యంగా ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. సోదరులతో కలిసిమెలిసి వుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంటుంది.
పరిహారాలు: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.
మిధున రాశి:ఈరోజు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు !
ఈరోజు బాగుంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని వ్యాపార లాభాలు పొందుతారు. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. అన్నదమ్ము లు సఖ్యతగా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా చదివి పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. కొత్త ఉద్యోగాలు పొందుతారు.
పరిహారాలు: అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.
కర్కాటక రాశి:మిత్ర లాబం పొందుతారు !
ఈరోజంతా శుభయోగంగా ఉంటుంది. మొండి బకాయిలు వసూలు చేసుకొని ధన లాభం పొందుతారు. శత్రువులు కుడా మిత్రుల అవుతారు. మిత్ర లాబం పొందుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. ఈరోజు శ్రమ తగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
పరిహారాలు: ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకొండి.
సింహరాశి:ఈరోజు పెట్టుబడులకు అనుకూలం !
ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. లాభాలు పొందుతారు. సోదరులు కలిసిమెలిసి సఖ్యత గా ఉంటారు. కనక వస్తువులను కొనుగోలు చేస్తారు.
పరిహారాలు: ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.
కన్యారాశి:వైవాహిక జీవితం బాగుంటుంది !
ఈరోజు ఏ పని చేసిన ఓర్పుగా చేస్తారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. విద్యార్థుల బాగా చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకున్న స్థాయిలకు స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది.
పరిహారాలు: లలితా చాలీసా పారాయణం చేసుకోండి.
తులారాశి:శత్రువులు మిత్రులు అవుతారు !
ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆదిక ధన లాభం పొందుతారు. చెప్పుడు మాటలకు దూరంగా ఉంటారు. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. పెద్ద వారి మాటలను గౌరవిస్తారు. సోదరులతో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. పోయిన వస్తువులను ఈరోజు పొందుతారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు.
పరిహారాలు: ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.
వృశ్చిక రాశి:గౌరవ మర్యాదలు పొందుతారు !
ఈరోజు కుటుంబ సభ్యులతో ఎకువ సమయాని గడుపుతారు. ఎవరి మీదా ఆధారపడకుండా మీ పని మీరే చేసుకోవడంలో ఆనందం పొందుతారు. కాంట్రాక్టు ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వలన ధన లాభం కలుగుతుంది. వివాహాలకు అనుకూలంగా ఉంటుంది.సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
పరిహారాలు: కృష్ణాష్టకం పారాయణం చేసుకొండి.
ధనస్సు రాశి:తీర్థయాత్రలు చేస్తారు !
ఈరోజు బాగుంటుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వలన లాభాలు కలుగుతాయి. ఈరోజు ఉద్యోగస్తులకు స్థాన బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు.
పరిహారాలు: శుభ ఫలితాల కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.
మకర రాశి:వ్యాపారంలో లాభాలు !
ఈరాజు ప్రయోజకరంగా ఉంటుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అనారోగ్యం నుండి బైటపడుటరు. సమాజంలో ఉన్నత వ్యక్తులుగా పేరు పొందుతారు. ఉద్యోగస్తులు పదోన్నతి పొందుతారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. భార్యాభర్తల సఖ్యతగా ఉంటారు.
పరిహారాలు: దక్షిణామూర్తి ఆరాధన చేసుకొండి.
కుంభరాశి:బంధువులను కలుసుకుంటారు !
ఈరోజు అంతా ప్రయోజకరంగా ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు సమాజ సేవ చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువుకుంటారూ. వ్యాపారంలో లాభాలు పొందుతారు.ఈరోజు బంధువులను కలుసుకుంటారు. మీ లక్షం కోసం బాగా శ్రమిస్తారు.
పరిహారాలు: ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి.
మీన రాశి:ఈరోజు పోటీపరీక్షల్లో విజయం !
ఈరోజు బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. వివాదాలకు దినంగా వుంటారు. అప్పుల బాధలు తీర్చుకొని ధన లాభం పొందుతారు. ప్రయాణల వల లాభాలు. వైవాహిక జీవితం బాగుంటుంది.
పరిహారాలు: ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.
…………………….
– శ్రీ