మహా ట్రాక్టర్ ర్యాలీలో అలజడికి పాక్ కుట్ర ?

-

రేపు రైతు చట్టాలకి వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన మహా ట్రాక్టర్ ర్యాలీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. గణతంత్ర దినోత్సవం రోజు ర్యాలీ నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతించారు.  అయితే నిబంధనలకు లోబడే నిరసనలు తెలపాలని తేల్చి  చెప్పారు. దేశ వ్యతిరేక నినాదాలు, పోస్టర్ లు ప్రదర్శింపచేయరాదని స్పష్టం చేసారు. ఇక ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి ట్రాక్టర్ల ఢిల్లీ వైపు కదులుతున్నాయి.

ఈ మహా ర్యాలీలో దాదాపు మూడు లక్షల ట్రాక్టర్లు పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఢిల్లీలో రి పబ్లిక్ డే పెరేడ్ అయిన తర్వాతనే ఈ ట్రాక్టర్లను అనుమతించనున్నారు. అంటే దాదాపుగా ట్రాక్టర్లు ఢిల్లీలోకి మధ్యాహ్నం తర్వాతనే అడుగుపెట్టనున్నాయి. అయితే ఈ మహా ర్యాలీలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నిందని ఢిల్లీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అందుకు సంబంధించి చాలా ట్విట్టర్ లింకులు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఎక్కడికక్కడ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news