నేటి నుండి ప్రైవేట్ మెడికల్ సిబ్బందికి వ్యాక్సిన్ !

-

భారత్ లో కరోనా వ్యాక్సిన్ వేసిన ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. అయితే ముందుగా మెడికల్ సిబ్బంది కి ఈ కరోనా వ్యాక్సిన్ అందజేస్తున్నారు. నిన్నటి దాకా ప్రభుత్వ మెడికల్ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేయగా నేటి నుంచి ప్రైవేట్ మెడికల్ సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు కానుంది. నిన్నటి దాకా ప్రభుత్వ మెడికల్ సిబ్బంది, ఆశావర్కర్లు, ఏఎన్ఎం వంటి వారికి కరోనా వ్యాక్సిన్ అందజేశారు. వీరందరికీ సెకండ్ డోస్ సరిగ్గా నెల తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది.

నిజానికి వ్యాక్సిన్ మీద ఉన్న భయంతో చాలా మంది ప్రభుత్వ మెడికల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోలేదు. అయితే వీరందరికీ వ్యాక్సిన్ మళ్ళీ ఇస్తారా ఇవ్వరా అనేది చర్చనీయాంశంగా మారింది.అయితే వ్యాక్సిన్ వికటించి ఆంధ్రప్రదేశ్ లో ఒకరు తెలంగాణలో ఒకరు చనిపోయారు అని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే వారు వ్యాక్సిన్ వికటించి చనిపోయారా లేక మరేదైనా కారణాలతో చనిపోయారా ? అనే దాని మీద ప్రభుత్వాలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news