ప్రస్తుత తరుణంలో పిల్లలు చాలా స్మార్ట్‌గా ఉన్నారు. పెద్దలు ఏది చేసినా దాన్ని ఇట్టే పట్టేస్తున్నారు. అంతేకాదు అద్భుతమైన తెలివితేటలను కూడా ప్రదర్శిస్తున్నారు. ఇక ఇలాగే అక్కడ ఓ బాలుడు కూడా ఏకంగా ఎస్‌యూవీ కార్‌నే నడిపాడు. ఇంతా చేస్తే అతని వయస్సు 5 ఏళ్లు మాత్రమే.
పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో బోసన్ అనే ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే ఓ రహదారిపై ఓ 5 ఏళ్ల బాలుడు ఎస్‌యూవీ కార్‌ను డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఆ కార్‌లో ఎవరూ లేరు. కనీసం ముందు సీట్‌లో ఆ బాలుడికి చెప్పేందుకు కూడా అతని పెద్దలు ఎవరూ లేరు. ఇక ఆ బాలుడు యాక్సలరేటర్, బ్రేక్, క్లచ్ ను ఆపరేట్ చేసేందుకు గాను స్టీరింగ్ వద్ద నిలుచుని కార్‌ను నడిపినట్లు వీడియో చూస్తే తెలుస్తుంది. అతని పక్కనే వెళ్తున్న ఎవరో ఆ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
A small kid driving Landcruiser in Multan 😳 how’s his feet even touching pedals. Whose kid is this 😂 pic.twitter.com/h5AXZztnYb
— Talha (@talha_amjad101) January 26, 2021
అయితే ఆ బాలుడు ఆ కార్‌ను నడిపినప్పటికీ అతన్ని ఎక్కడా ఒక్క పోలీసు కూడా ఆపకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. కానీ ఈ వీడియో వైరల్ అయ్యాక స్థానిక పోలీసులకు ఈ విషయం తెలిసింది. దీంతో ఆ బాలుడు ఎవరు, అతని తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ ఉంటారు ? అనే వివరాలను ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నారు. చట్టప్రకారం ఆ వయస్సు ఉన్నవారికి వాహనాలను ఇవ్వకూడదు. వారు అలా ఇచ్చారు కనుక ఆ బాలుడి ప్రాణాలనే కాదు, ఇతరు ప్రాణాలను కూడా రిస్క్‌లో పెట్టారు. దీంతో ఆ బాలుడికి కారు ఇచ్చిన అతని తల్లిదండ్రులను పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. వారి వివరాలు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.