ర‌ష్యాలో త‌గ్గుతున్న జ‌నాభా.. అన్ని దేశాల ప‌రిస్థితి అదే.. క‌రోనానే కార‌ణ‌మా ?

-

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వల్ల ఎన్నో ల‌క్ష‌ల మంది చ‌నిపోయారు. దీని వ‌ల్ల ప్ర‌పంచంలో అనేక దేశాల్లో జ‌నాభాలో స్వ‌ల్ప త‌గ్గుద‌ల క‌నిపించింది. అయితే ర‌ష్యాలో మాత్రం కొంచెం ఎక్కువ‌గానే జ‌నాభా త‌గ్గుద‌ల చోటు చేసుకుంది. గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు ర‌ష్యాలో 5.10 ల‌క్ష‌ల జ‌నాభా త‌గ్గింది.

Declining population in Russia .. Is it because of Corona?

2020లో ప్ర‌పంచంలో అనేక దేశాల్లో ల‌క్ష‌ల మంది క‌రోనా వల్ల చ‌నిపోయారు. ర‌ష్యాలో 71,651 మంది చ‌నిపోయారు. అయిన‌ప్ప‌టికీ ర‌ష్యాలో ఇంకా ప‌లు ఇత‌ర కార‌ణాల వల్ల కూడా జ‌నాభా త‌గ్గుతూ వ‌స్తోంది. 1991లో యూనియ‌న్ ఆఫ్ సోవియ‌ట్ సోష‌లిస్ట్ రిప‌బ్లిక్స్ ప‌డిపోయిన‌ప్ప‌టి నుంచి ర‌ష్యా జ‌నాభాలో గ‌ణ‌నీయ‌మైన త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. అక్క‌డ శిశు జ‌న‌నాల రేటు త‌క్కువ‌గా ఉండ‌డం, స‌గ‌టు మ‌నిషి ఆయుర్దాయం 72 ఏళ్ల‌కు ప‌డిపోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కూడా ర‌ష్యాలో జనాభా త‌గ్గుతోంది.

అయితే క‌రోనా వ‌ల్ల ప్ర‌పంచంలో అనేక దేశాల్లో 2020లో మ‌ర‌ణాలు సంభవించినా జ‌నాభా పెరుగుద‌ల లేదా త‌గ్గుద‌ల ఎలా ఉంది అనే వివ‌రాల‌పై ఇంకా ఎవ‌రూ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. కానీ వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే మాత్రం జనాభాలో త‌గ్గుద‌ల స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అయితే ఈ ఏడాదిలో క‌రోనా వ్యాక్సిన్లు వేస్తుండ‌డం, ఇప్ప‌టికే క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల జ‌నాభా మ‌ళ్లీ పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news